ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపును ఆలయ అధికారులు శుక్రవారం నిర్వహించారు. 15 రోజులకు గాను శ్రీ వారి హుండీకి నగదు రూపంలో కోటీ 54లక్షల 91వేల 55 రూపాయల ఆదాయం వచ్చింది. కానుకల రూపేణా 305 గ్రాముల బంగారం, 4.310 కేజీల వెండి లభించినట్లు ఆలయ ఈవో ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. ఈసారి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందన్నారు.
ఇదీ చదవండి