హిందూ ధర్మ పరిరక్షణకు పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారక తిరుమల వెంకటేశ్వర దేవస్థానంలోని... వేద పాఠశాల తమవంతు పాత్ర పోషిస్తోంది. ఆలయ నిర్వహణ, పరిరక్షణ విధులకు సంబంధించి విద్యార్థులకు శిక్షణ ఇస్తూ కొత్త తరం అర్చకులు, యాజ్ఞికులను తయారు చేస్తోంది. 1984లో కేవలం పది మంది విద్యార్థులతో ఏర్పాటైన ఈ వేద పాఠశాలలో ప్రస్తుతం 600 మంది చదువుకుంటున్నారు. ఆలయం నిర్మించే సమయంలో స్థలం ఎంపిక నుంచి నిర్మాణం, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ వరకు అన్ని అంశాలూ ఈ వేద పాఠశాలలో బోధిస్తారు.
3 భాగాలుగా విద్య
వేద పాఠశాలలో విద్యార్థులకు బోధన కఠినతరంగా సాగుతుంది. విద్యార్థులు తెల్లవారుజామున 5 గంటలకే నిద్రలేచి వేద పఠనం, మంత్రోచ్ఛారణ చేస్తారు. ప్రవేశ, వర, ప్రవర అని 3 భాగాలుగా విద్య అందిస్తారు. ఈ కోర్సు పూర్తి చేస్తే అర్చక వృత్తిలో స్థిరపడటం లేదా తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశం ఉంటుంది. పాఠశాలలో ఉచిత భోజనం, వసతి అందిస్తారు.వేద పాఠశాలలో ప్రవేశానికి దేవదాయ ధర్మదాయ శాఖ ఏటా పరీక్షలు నిర్వహిస్తుంది. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తుంది.
ఇదీ చదవండి :