అభయ హస్తాలతో మహాలక్ష్మి దేవిగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో ఉన్న దానేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సిరి సంపదలు విలసిల్లు తాయని భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారికి ప్రియమైన కలువ పూలను సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. కరోనా నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తుల కోసం దేవస్థాన పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఇవీ చూడండి...