ETV Bharat / state

Drinking Water Problems in West Godavari District: ప్రతిపక్షంలో హామీలిచ్చారు.. అధికారంలోకి వచ్చాక అమలు మరిచారు

Drinking Water Problems in West Godavari District: వాగు దాటే వరకు ఓడ మల్లన్న.. వాగు దాటిన తర్వాత బోడ మల్లన్న అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజల మెప్పు కోసం జగన్​మోహన్​ రెడ్డి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినట్లుగా అనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రజలకు తాగు నీటి సమస్యలపై ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీలను.. అధికారం చేపట్టిన తర్వాత నేరవేర్చటం లేదు.

Drinking_Water_Problems_in_West_Godavari_District

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2023, 11:56 AM IST

Drinking Water Problems in West Godavari District: ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలెందుకు లేదు..

Drinking Water Problems in West Godavari District: ప్రతిపక్షనేత హోదాలో పాదయాత్ర చేసిన సీఎం జగన్‌ ప్రజలపై అనేక హామీలు గుప్పించారు. అధికారంలోకి వస్తే వెంటనే నెరవేర్చేస్తానన్నట్లు రాష్ట్ర ప్రజలను నమ్మించారు. ఆయన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి రోజులు కాదు.. ఏళ్లు గడిచింది. అయినా హామీలు నెరవేరకపోయేసరికి.. జగన్‌ నటన ఎదుట విలక్షణ నటులు కూడా ఏమాత్రం సరిపోరని ప్రజలకు అర్థమవుతోంది. దీనికి ఉదాహరణే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మురుగునీటి కాలువలను శుద్ధి చేసి.. ఊరురా వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్న ఆయన హామీ నీటిమూటగానే మిగిలిపోయింది.

2018 మే నెలలో ప్రతిపక్షనేత హోదాలో పాదయాత్ర చేస్తూ.. ఢంకా బజాయించి మరీ జగన్‌ మాటలు చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి, ఉంగుటూరు నియోజకవర్గాల్లో జగన్‌ పర్యటించారు. అప్పుడు కలుషిత నీటిని తాగలేకపోతున్నామని.. స్వచ్ఛమైన తాగునీరు అందించాలని అక్కడి ప్రజలు తమ సమస్యలను జగన్‌కు వినిపించారు. జగన్‌ సీఎం అయ్యి నాలుగున్నరేళ్లు అవుతోంది. ఆయన ఇచ్చిన మాట నెరవేరుతుందని, తాగునీటి కష్టాలు తీరతాయని.. ఇన్నాళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆయా గ్రామాల ప్రజల తాగునీటి వెతలతో మాకేంటి సంబంధం అన్న రీతిలో వైసీపీ ప్రభుత్వ ధోరణి ఉంది.

Drinking Water Pipeline in drainage దారుణం.. మురుగు నీటి కాలువలో తాగు నీటి వైపులైన్! రోగాల బారిన ప్రజలు..

పంట కాలువల్లోని నీరే ఆధారం: ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు, కాళ్ల, ఉండి, పాలకోడేరు మండలాల్లో 70 గ్రామాలు ఉన్నాయి. సుమారు 2లక్షల 75 వేల మంది జనాభా ఉండగా.. వీరందరికీ వెంకయ్యవయ్యేరు, పాతవయ్యేరు, ఉండి పంట కాలువల్లోని నీరే ఆధారం. కాలువల పక్కన ఎక్కడా కొత్తగా సమ్మర్‌ స్టోరేజే ట్యాంకులు నిర్మించలేదు. 14 గ్రామాల్లో పాత ట్యాంకుల్లో పూడికతీత పనులూ చేపట్టలేదు.

గుమ్ములూరు, సీసలి, జక్కరం గ్రామాల్లో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులు తవ్వారు. కోలనపల్లిలో ఓహెచ్​ఆర్​ నిర్మించారు. జేజీఎంలో పైపులైన్ల విస్తరణ పనులు ఏడెనిమిది చోట్ల మొదలుపెట్టారంతే. ఉండి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉప కాలువల ద్వారా రక్షిత పథకాల చెరువులకు నీరు వస్తుండగా.. అలా వస్తున్న జలాలన్నీ పూర్తిగా కలుషితమవుతున్నాయి.

State Govt ignore Jaljeevan Mission: తాగునీటికి పైసా ఖర్చు పెట్టని జగన్ ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో దాహం కేకలు

కలుషితమవుతున్న సాగు, తాగునీరు: సాగు, తాగు నీరు అందించే పంట కాలువల్లోకి మురుగు వ్యర్థాలు, ఆక్వా చెరువులు, డ్రెయిన్లలోని నీరు నేరుగా వచ్చి చేరుతోంది. వెంకయ్య వయ్యేరు, పాత వయ్యేరు, ఉండి ప్రధాన పంట కాలువల్లో.. వ్యర్థాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని పర్యావరణ నిపుణులు గుర్తించారు. 2010-2015 మధ్యలో భీమవరంలోని నీటిని పరీక్షించి వివిధ బ్యాక్టీరియా రకాలు ఉన్నాయని తేల్చారు. ఈ నీటిని తాగితే అనేక వ్యాధులు సోకే ప్రమాదం ఉందని తెలిపారు. కానీ ఇదే నీటిని చెరువులకు తీసుకొచ్చి.. అరకొరగా శుద్ధి చేసి ఇళ్లకు సరఫరా చేస్తున్నారు.

"మంచినీటి చెరువుకు నీళ్లు ఉండి నుంచి రావాలి. ఇళ్లల్లోని బాత్​రూంల పైప్​లైన్లు పంటకాలువలకు అనుసంధానం చేశారు. కలెక్టర్​కు ఫిర్యాదు చేశాము. ఎవరూ పట్టించుకోవటం లేదు. చూస్తూ.. చూస్తూ ఆ నీటిని తాగలేకపోతున్నాము." -కేశన బలుసులురావు, కోలమూరు

"అన్ని ఉండి అల్లుని నోట్లో శని ఉంది అన్నట్లుగా ఉంది మా పరిస్థితి. గోదావరి ప్రాంతాలు మంచినీటికి మంచివని అంటారు. అలాంటిది. మంచినీళ్లు కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచినీరు ఇస్తామని అన్నారు. ఇప్పటి వరకు అది జరగలేదు." -బుచ్చేశ్వరరావు, పాములపర్రు

kakinada people protest For Water: కాకినాడ నగర శివారులో కలుషిత నీరు సరఫరా.. ఆందోళనకు దిగిన బాధితులు

జగన్‌ నిర్మిస్తామన్న మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఒక్కదాన్నీ చేపట్టలేదు సరికదా.. తెలుగుదేశం పార్టీ హయాంలో దాతలు నిర్మించిన ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకాలనూ.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పక్కన పెట్టేసింది. విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడం, నిర్వహణ లోపాలతో మూలన పడేశారు. ప్రైవేటు సంస్థలు శుద్ధ జలం పేరుతో అమ్మేస్తున్న నీరే ప్రజలకు జీవనాధారమవుతోంది. ఒక్కో కుటుంబం రక్షిత మంచినీటి కోసం ఈ నాలుగేళ్లలో సుమారు 30 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌.. సమస్యలు పరిష్కరించకపోగా తమ పరిస్థితి మరింత అధ్వాన్నంగా మార్చారంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

"మా గ్రామంలోకి వచ్చే పంటకాలువలో పైనున్న వాళ్లు వ్యర్థాలు అందులో పారేస్తున్నారు. ఇటీవల జగనన్నాకు చెబుదాంలో ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అవసరమైతే గ్రామాన్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్లాలి అనిపిస్తోంది." -మంగిన శ్రీహరి, ఆరేడు

"2018లో జగన్​మోహన్​ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర మా గ్రామం మీదుగా వెళ్లింది. అధికారం ఇవ్వండి గ్రామంలో కలుషితాన్ని అరికట్టి.. తాగటానికి మంచినీరు ఇస్తానని పాదయాత్ర సందర్భంగా ఆయన వాగ్దానం చేశారు." -ధనికొండ శ్రీనివాస్, ఆరేడు

Drinking Water Problem: గిరిజనుల దాహం కేకలు.. నీటి ఊటలే ఆధారం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.