కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ పశ్చిమగోదావరి జిల్లాలో మందుబాబులు చెలరేగిపోతున్నారు. మద్యం దుకాణాల వద్ద వందల సంఖ్యలో మందుబాబులు దర్శనమిస్తున్నారు. జిల్లాలోని అన్ని పట్టణ ప్రాంతాల్లోనూ, 6 మండలాల్లోని అన్నీ గ్రామాల్లోనూ, మిగిలిన 42 మండలాల్లోని 83 గ్రామాలలో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలులో ఉంది.
ఆయా ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో లాక్ డౌన్ లేని గ్రామాల్లోని మద్యం దుకాణాలకు మందుబాబుల ఎగబడుతున్నారు. ఏ దుకాణం వద్ద చూసినా భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. సామాజిక దూరం మాత్రం కనుచూపుమేరలో లేదు. సీసా దొరికితే చాలన్నట్టుగా మందుబాబులు పడిగాపులు కాస్తున్నారు.
ఇదీ చూడండి