కొవ్వలి గ్రామానికి చెందిన వడ్లపట్ల సుధాకర్ బాబు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు, కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు నిరంతరం కృషి చేస్తున్నందుకు వీరికి ధన్యవాదాలు తెలిపారు. పోలీసులకు పండ్లు, శానిటైజర్లు పంచిపెట్టారు. కొవ్వలి పంచాయతీ కార్మికులకు 25 కేజీలు బియ్యం, కూరగాయలు అందించారు.
నర్సాపురం మండలం సార్వ గ్రామంలో వైకాపా నాయకుల ఆధ్వర్యంలో రూ. లక్షతో సమకూర్చిన కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొన్నారు. అనంతరం వాలంటీర్లు గ్రామంలోని 1000 కుటుంబాలకు కూరగాయలు అందజేశారు. పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు.
ఇదీ చదవండి: