కొల్లేరు పరిరక్షణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన.. అమ్మఒడి యాప్, దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు, కరోనా వైరస్ పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలో వాటర్ గ్రిడ్ అమలుకు రూ.3,800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొల్లేరులో మూడు రెగ్యులేటర్ల నిర్మాణానికి రూ.400 కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి మంత్రులు ఆళ్ల నాని, తానేటి వనిత, చెరుకువాడ రంగనాథరాజు, ఇతర ఎమ్యెల్యేలు హాజరయ్యారు.
ఇదీ చూడండి: