పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు న్యాయం చేసేవరకు నిర్మాణ పనులు ఆపేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు వల్ల 8 మండలాల్లోని 300కు పైగా గ్రామాలు శాశ్వతంగా నీట మునిగిపోతాయని.. ఈ గ్రామాల్లోని 70వేల కుటుంబాలకు ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయలేదని ఆరోపించారు.
పరిహారం ఇవ్వకుండా..కాఫర్ డ్యామ్ పూర్తిచేసి గ్రామాలను జలసమాధి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సహాయంతో నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని..తక్షణమే నిర్బంధ చర్యలు ఆపాలని కోరారు. ఈనెల 16వ తేదీన నిర్వాసిత గ్రామాల్లో పర్యటిస్తామని మధు ప్రకటించారు.