ETV Bharat / state

కరోనా సోకినా.. మారని దొంగలు

అసలుకే వారిద్దరూ దొంగలు.. ఆ పనిలో ఉండగానే కరోనా సోకింది. ఆసుపత్రి పాలవ్వాల్సి వచ్చింది. అయినా.. వాళ్లు మారలేదు. కొవిడ్ ఆసుపత్రి నుంచి ఉడాయించారు. దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే ఏకంగా విజిలెన్స్ ఎస్పీ ఇంటిని గుల్ల చేశారు. చివరికి పోలీసులకు చిక్కారు.

thief arrests
కరోనా దొంగలు అరెస్ట్
author img

By

Published : Aug 10, 2020, 4:42 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సీఆర్ఆర్ మహిళా కళాశాల కొవిడ్ కేర్ సెంటర్ నుంచి తప్పించుకున్న ఖైదీలు నాగదుర్గా ప్రసాద్, వెంకటనారయణ... ఎట్టకేలకు పట్టుబడ్డారు. దొంగతనాల కేసుల్లో ఏలూరు జిల్లా కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వీరిద్దరికీ కరోనా సోకింది. చికిత్స కోసం సీఆర్ఆర్ మహిళా కళాశాల కొవిడ్ కేర్ సెంటర్​కు తరలించారు.

ఆ తర్వాత..

ఆ మరుసటి రోజే అక్కడ నుంచి పరారైన నిందితులు దొంగతనాలు మాత్రం ఆపలేదు. మరో నలుగురు దొంగలతో కలిసి భీమవరం, ఏలూరులో వరుస చోరీలకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఏలూరులోని విజిలెన్స్ ఎన్​ఫోర్స్​మెంట్ ఎస్పీ వరదరాజులు ఇంట్లోనూ దొంగతనం చేశారు. ఎట్టకేలకు దొంగలిద్దరూ పోలీసులకు చిక్కారు. వారినుంచి 35 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నాయక్ వెల్లడించారు.

ఇదీ చదవండి:

పోలవరం ప్రాజెక్టు పూర్తికి అన్ని వనరులను సమీకరించండి: మంత్రి అనిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.