పశ్చిమ గోదావరిజిల్లా కొవిడ్ కేసుల సంఖ్య తీవ్రమవుతోంది. ఏలూరులో పలు ప్రాంతాల్లో రెడ్ జోన్లు ఏర్పాటు చేశారు. నగరంలోని ఆర్.ఆర్. పేటలోని గుబ్బలవారివీధి, ఎన్ఆర్ పేటలోని మోర్ వీధి, నారాయణ కళాశాల రహదారిలో రెడ్ జోన్లను ఏర్పాటు చేశారు. కొవిడ్ పాజిటివ్ కేసులు అధికంగా రావటంతో.. ఈ ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించినట్లు అధికారులు వెల్లడించారు. రెడ్ జోన్లలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకొన్నారు.
ఇవీ చూడండి...