కరోనా మహమ్మారిని ఎదుర్కోవాడనికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఏలూరులో చెప్పారు. వైకాపా సమావేశానికి ఆయనతో పాటు.. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఐసొలేటెడ్ వార్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మందులు సిద్ధం చేశామని చెప్పారు. కరోన్ వైరస్ రాకుండా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం ముఖ్యమని ప్రజలకు సూచించారు. మాస్కుల కొరత రాకుండా చర్యలు చేపట్టామన్నారు. భక్తుల రద్దీ ఉండే తిరుమలలోనూ కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి అన్ని జాగ్రత్తలు చేపట్టినట్ల తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి: