పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 16 మందికి వైరస్ నిర్ధరణ అయింది. ఇందులో 11 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో 90 మంది విద్యార్థులు, 48 మంది టీచర్లు వైరస్ బారిన పడ్డారు. మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి
CM JAGAN REVIEW: ప్రజారోగ్యంపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి: జగన్