కరోనా వ్యాప్తి నివారణకు ఏర్పాటైన సీఎం సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ఆంధ్రా షుగర్స్ సంస్థ... తన అనుబంధ సంస్థలతో కలిపి 2కోట్ల 85 లక్షల రూపాయల చెక్కును సీఎం జగన్‌కు అందించింది. దాంతో పాటు 80లక్షల విలువైన 800 టన్నుల సోడియం హైపోక్లోరైట్, 7వేల500 లీటర్ల శానిటైజర్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించింది. సాగర్ సిమెంట్స్ తరఫున ఆ సంస్థ ఎండీ ఆనంద్‌రెడ్డి, జేఎండీ శ్రీకాంత్‌రెడ్డి... కోటి రూపాయల చెక్‌ను సీఎంకు అందించారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలోని స్నేహసుధ చిట్‌ఫండ్ సంస్థ తరఫున... 2 లక్షల రూపాయల విరాళాన్ని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి అందజేశారు.
ఇదీ చూడండి ఆ అలవాట్లు మానేస్తే కరోనా రాకుండా జాగ్రత్తపడొచ్చు'