పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురిలో సర్పంచి అభ్యర్థి విజయోత్సవ ర్యాలీ ఘటనపై దళిత సంఘాలు ఆందోళన నిర్వహించాయి. దళితులపై దాడి చేసిన జనసేన మద్దతుదారులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ... దళిత నాయకులు నినాదాలు చేశారు. గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు.
మాటామాటా పెరిగి..
మత్స్యపురిలో జనసేన మద్దతుదారు సర్పంచ్‌గా గెలవడంతో గురువారం విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో బాణాసంచా కాల్చడంతో ఆ నిప్పురవ్వలు దళిత మహిళపై పడ్డాయి. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో పరిస్థితి ఘర్షణకు దారి తీసింది.
ఇదీ చదవండి: మత్స్యపురిలో జనసేన, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ