ETV Bharat / state

గుండెపోటుతోనే కరోనా పేషెంట్ మృతి: కలెక్టర్ కార్తికేయ మిశ్రా - ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో కొవిడ్ రోగి మృతి

ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో కొవిడ్ బాధితుడు దొరబాబు గుండెపోటుతో మృతిచెందినట్లు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. మృతుడు సీవియర్ డయాబెటిస్ పేషెంట్ అని కలెక్టర్ అన్నారు.

Collector Kartikeya Mishra
కలెక్టర్ కార్తికేయ మిశ్రా
author img

By

Published : Jun 28, 2021, 9:04 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో కరోనా రోగి దొరబాబు.. గుండెపోటుతో మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. సీవియర్ డయాబెటిస్ పేషెంట్ దొరబాబు.. మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదని తేల్చి చెప్పారు. ఆ సమయంలో విద్యుత్, ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని వివరించారు.

కొవిడ్ నుంచి కోలుకున్న అనంతరం అతను గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని తెలిపారు. కొవిడ్ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని... బాధితులకు ఇబ్బంది లేకుండా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

RDS Controversy: ఆర్‌డీఎస్‌ కుడికాలువ నిర్మాణం సక్రమమే: మంత్రి అనిల్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.