పశ్చిమగోదావరిజిల్లాలో పుంజులు రంజుమీదున్నాయి. డెల్టా ప్రాంతంలో...... పెద్ద బరులు , మెట్టప్రాంతాల్లో మోస్తారు బరులు నడుస్తున్నాయి . నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు ప్రాంతాల్లోని బరుల్లో .. పందేలు పెద్ద ఎత్తునసాగాయి. కోట్ల రూపాయలు చేతులు మారాయి. పెద్ద బరిలో లక్ష నుంచి 20లక్షల రూపాయల వరకు..... పందేలు జరిగాయి. ఓ మోస్తారు బరుల్లో 30వేల నుంచి లక్ష రూపాయల వరకు పందేలు కాశారు. మొత్తంగా రెండువందల కోట్ల రూపాయల వరకు పందేల లావాదేవీలు సాగినట్లు.... తెలుస్తోంది.
భోగిరోజు కోడిపందేలు కాస్త ఆలస్యంగా మొదలైన.... సంక్రాంతి రోజు మాత్రం ఉదయం నుంచే కోళ్ల కొట్లాట జరిగింది. భీమవరం పరిసర ప్రాంతాల్లో.... పెద్దమొత్తంలో పందేలు సాగాయి. కోడిపందేలు రాత్రిళ్లూ నిర్వహించేందుకు ఫ్లడ్‌లైట్లు, మంచి వేదికలు, షామియానాలు.... ఏర్పాటు చేయడంతో.. పందెంరాయుళ్లు భారీగా తరలివచ్చారు. పందేలు చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచీ ప్రజలు వచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బంధువులను స్థానికులు.... బరుల వద్దకు తీసుకుని వచ్చి.. పందేలు చూపించారు. కొన్నిబరుల వద్ద భారీగా వాహనాలు కనిపించాయి.
కోడిపందెం బరుల వద్ద గుండాట, పేకాట వంటి జూదం కూడా..... భారీగానే జరిగింది.పందేలకు ముందు హడావుడి చేసిన పోలీసులు....మొదటి రెండ్రోజులు ఆ ఛాయలకూ రాలేదు.మూడోరోజూ పెద్దఎత్తున పందేలకు పందెంరాయుళ్లు సిద్ధమయ్యారు.
ఇవీ చదవండి