ETV Bharat / state

ఎంపీ, ఎమ్మెల్యేల వివాదంపై అధిష్ఠానం సీరియస్‌ - నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు వార్తలు

వైకాపాలో నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎంపీ, ఎమ్మెల్యేల వివాదంపై అధిష్ఠానం సీరియస్​గా ఉంది.

mp raghuram
mp raghuram
author img

By

Published : Jun 18, 2020, 5:46 AM IST

వైకాపాలో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. పార్టీకి చెందిన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అధిష్ఠానం నిర్ణయాన్ని మండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు. నరసాపురంలో వైకాపా నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణిస్తున్నారని ఆయన అన్నారు.

పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరించే నేతలు ఎంతటి పెద్దవారైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారని, పార్టీ నేతలందరూ దీన్నే నోటీసుగా పరిగణించాలని ఆయన చెప్పారు. సచివాలయంలో ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ‘ఎంపీ రఘురామకృష్ణరాజు తీరు సరికాదు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. నరసాపురంలో ఏం జరిగింది, ఎవరు తొందరపడ్డారనే దానిపై సీఎం సమాచారం తెప్పించుకుంటున్నారు. నేతలు గీత దాటి ముందుకెళ్తే క్రమశిక్షణ చర్యలకు వెనుకాడం. ఇది అన్ని ప్రాంతాలకూ వర్తిస్తుంది. ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది, ఎన్నికలకు వెళ్లేది పార్టీ. అంతేగానీ ఎన్నికలకు వెళ్దామని ఎవరికి వారు సవాళ్లు విసురుకోవడం కుదరదు. ఇలా చేయడాన్ని సీఎం తీవ్రంగా పరిగణిస్తున్నారు’ అని ఉమ్మారెడ్డి తెలిపారు.

ఎంపీ వ్యాఖ్యలతో దుమారం

సీఎం జగన్‌ తనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్న రఘురామకృష్ణరాజు.. ఆ తర్వాత తితిదే ఆస్తుల అమ్మకాలు, ఇసుక అక్రమాలు, ఇళ్లస్థలాల భూముల కొనుగోళ్లలో అవినీతి వంటి విషయాలు ప్రస్తావిస్తూ ప్రభుత్వంపైన, పార్టీపైన ఘాటుగా విమర్శలు చేశారు. పార్లమెంటు పరిధిలోని అయిదుగురు ఎమ్మెల్యేల విజయానికి తానే కారణమన్నారు. దీనిపై మంత్రులు పేర్ని నాని, శ్రీరంగనాథరాజుతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు గట్టిగా స్పందించారు. దీంతో పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. ప్రధానంగా ఎంపీ, మంత్రి మధ్య విభేదాలున్నట్లు అనేక సందర్భాల్లో బయటపడింది. అందుకే నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షునిగా గోకరాజు రంగరాజును నియమించారని ఎంపీ వర్గీయులు అంటున్నారు. ఇది రఘురామకృష్ణరాజుకు చెక్‌ పెట్టేందుకేనన్నది వాళ్ల ఆరోపణ. మరోవైపు ఎంపీ వ్యాఖ్యలపై పార్టీలో నిరసన గళం వ్యక్తమవుతోంది. జిల్లాలో పలుచోట్ల బుధవారం ఆందోళనలు చేసి ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్లు వచ్చాయి.

వాళ్లకు నా కృతజ్ఞతలు

పార్టీలో సీనియర్ల సలహా మేరకు ఛోటా నాయకులు నా దిష్టిబొమ్మలను దహనం చేశారు. గొప్పవాళ్ల దిష్టిబొమ్మలే ఇలా చేస్తారు. తెలిసి చేసినా తెలియక చేసినా నియోజకవర్గానికే పరిమితమైన నన్ను రాష్ట్రంలోనే ముఖ్య నాయకుల్లో ఒకరిగా నిలబెట్టిన పార్టీ అభిమానులకు నా కృతజ్ఞతలు. పశువులకు కొంత దాణా ఉంచి, మిగిలిన గడ్డినే దిష్టిబొమ్మలుగా దహనం చేయాలని కోరుతున్నాను.

- రఘురామకృష్ణరాజు, ఎంపీ

పార్టీ లేకపోతే గడ్డి పరకతో సమానం

వైకాపా ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా.. 100% వైఎస్‌ కుటుంబం, జగన్‌ బొమ్మ పెట్టుకునే గెలిచాం. పార్టీ లేకపోతే ఎంపీ రఘురామకృష్ణరాజు గడ్డిపరకతో సమానం. తనకు ప్రజాబలం ఉందంటున్న ఆయన రాజీనామా చేసి మళ్లీ గెలవాలి. ఎమ్మెల్యేలను జంతువులతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి.

- ప్రసాదరాజు, వైకాపా ఎమ్మెల్యే

ఇదీ చదవండి: చైనాతో వివాదంపై 19న అఖిలపక్ష భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.