పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలిలో పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యకుమారి పర్యటించారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి.. సంబంధిత రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి.. రైతుల వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ వెంకట రమణరెడ్డి, వ్యవసాయ శాఖ జేడీఏ గౌసియా బేగం ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అక్రమంగా తరలిస్తున్న 79 బస్తాల ఎరువు పట్టివేత...