ETV Bharat / state

సినీ ఫక్కీలో దోపిడి.. ఒంటరి మహిళపై మత్తు చల్లి..! - మెగల్లులో దోపిడి

పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో సినీ ఫక్కీలో దారి దోపిడీ జరిగింది. బ్యాంకుకు వెళ్తున్న ఒంటరి మహిళపై మత్తు మందు చల్లి.. ఆమె వద్ద ఉన్న నగదుతో పారిపోయాడు ఓ ఆగంతకుడు.

cinematic robbery on women by a thief in mogallu  sbi in westgodavari
సినీ ఫక్కీలో దోపిడి.. ఒంటరి మహిళపై మత్తు జల్లి..!
author img

By

Published : Jan 30, 2020, 10:57 AM IST

సినీ ఫక్కీలో దోపిడి.. ఒంటరి మహిళపై మత్తు చల్లి..!

పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు గ్రామంలో.. ఇంటి నుంచి బ్యాంకుకి వెళ్తున్న లక్ష్మీ అనే మహిళపై ఓ దుండగుడు మత్తు మందు చల్లాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లగానే.. ఆమె హ్యాండ్ బ్యాగ్​ని బ్లేడుతో కత్తిరించి.. 1,90,000 రూపాయల నగదును దోచేశాడు. హైదరాబాదులో ఉన్న తన కూతురి గృహ ప్రవేశం కోసం అకౌంట్​లో డబ్బులు వేయడానికి మోగల్లు ఎస్​బీఐకి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అక్కడే పడి ఉన్న మహిళను గుర్తించిన స్థానికులు.. వివరాలు తెలుసుకొని ఇంటికి చేర్చారు. సంఘటనపై కేసు నమోదు చేసిన పాలకోడేరు ఎస్ఐ ఏజీఎస్ మూర్తి నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.