కరోనా ప్రభావం కోడి మాంసం ధరపై చూపిస్తోంది. కరోనా ప్రభావంతో కోళ్లకు దాణాలు లభ్యత తక్కువగా ఉండి.. ధర పెరగడంతో కోడి మాంసం ధర పెరిగింది. గతంలో రెండు కిలోల కోడి గిట్టుబాటు ధర 140 నుంచి 150 రూపాయలు అయితే దాణా ధరలు పెరగడంతో 180 నుంచి 190 రూపాయల వరకు అవుతోంది. రైతు నుంచి వ్యాపారులు రెండు కిలోల కోడిని రెండు వందల నలభై రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు.
వ్యాపారులు అదే కోడిని 280 నుంచి 300 వరకు అమ్ముతున్నారు. మాంసాన్ని కిలో 260 నుంచి మూడు వందల రూపాయల వరకు అమ్ముతున్నారు. రైతులు తగిన స్థాయిలో కోళ్లను పెంచకపోవడం వల్ల కోళ్ల లభ్యత తక్కువగా ఉండి మాంసం ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. దూర ప్రాంతాల నుంచి కోళ్లను తీసుకు రావాల్సి ఉండడంతో రవాణా ఛార్జీలు పెరిగిపోవడం, కోళ్లను ప్రాసెసింగ్ చేసేవారి కూలి పెరిగిపోవడం వల్ల 260 రూపాయలు అవుతున్నప్పటికీ గిట్టుబాటు కావడం లేదని వ్యాపారులు అంటున్నారు.
ఇదీ చదవండి: పేగు పంచావు.. ప్రాణం పోశావు..!