ETV Bharat / state

'సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చాగంటి ప్రవచనాలు' - CHAGANTI KOTESWARARAO update news

సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల సకల దోషాలు తొలగి.. శుభాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలోని సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అనేక ప్రవచనాలు వివరించారు.

chaganti-koteswararao-in-west-godavari
chaganti-koteswararao-in-west-godavari
author img

By

Published : Jan 4, 2020, 12:45 PM IST

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చాగంటి ప్రవచనాలు

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చాగంటి ప్రవచనాలు
Intro:AP_TPG_77_3_CHAGANTI_KOTESWARARAO_AV10164

సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల సకల దోషాలు తొలగి శుభాలు కలుగుతాయని, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సంతానప్రాప్తికి ప్రసిద్ధి అని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి లోని శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం లో శ్రీ సుబ్రహ్మణ్య ఆలయ విశిష్టత పై శుక్రవారం రాత్రి ఆధ్యాత్మిక ప్రచారం చేశారు. దత్త క్షేత్రం లో ఆధ్యాత్మిక భావాలు పెరుగుతున్నాయన్నారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ ఈ దత్త క్షేత్రాన్ని సందర్శించినట్లు చాగంటి తెలిపారు ఇక్కడ ఆధ్యాత్మికతతో కూడిన వాతావరణం తను ఎంతో ఆకర్షించింది అన్నారు ఈ క్రమంలో మళ్ళీ ఇక్కడకు వచ్చినపుడు ఈ దత్త క్షేత్ర నిర్వాహకులు కలవచర్ల శ్రీనివాస్ చెప్పాలని కోరారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సంతాన ప్రాప్తికి ఎంతగానో ప్రసిద్ధి అని, నా కుమారుడికి సంతాన ప్రాప్తి కలిగిస్తే తప్పకుండా ప్రవచనం చెప్తానని బదులిచ్చినట్లు చాగంటి వివరించారు. స్వామివారి అనుగ్రహం వల్ల తనకు మనవడు మనవరాలు లభించినట్లు చెప్పారు. చాగంటి ప్రవచనాలు కి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.


Body:ఉంగుటూరు


Conclusion:9493990333
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.