ప్రముఖ విద్యావేత్త, మాజీ మంత్రి చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు శత జయంత్యోత్సవాలను పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మూర్తిరాజు స్థాపించిన గణపవరం డిగ్రీ కళాశాల వేదిక అయింది. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ, మూర్తి రాజు కలిసి ఉన్న విగ్రహాలను ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆవిష్కరించారు. మూర్తిరాజు మానవత్వం పరిమళించే మహానీయుడని, విద్యాదాతగా ఆయన చేసిన సేవలు అభినందనీయమని కొనియాడారు.
మూర్తిరాజు తండ్రి చింతలపాటి బాపిరాజు పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి... 68 విద్యాలయాల నిర్మాణానికి కృషి చేశారని గుర్తు చేశారు. 1800 ఎకరాల స్థలాన్ని ప్రజాసేవకు ఖర్చు చేసినవారు చరిత్రలో మరొకరు ఉండరని పలువురు తెలిపారు.
ఇదీ చదవండి: మన కాలపు మహనీయుడు