పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శివారు కేఎస్ఎన్ కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల వరకు సోదాలు చేశారు. 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 20 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వరరెడ్డి తెలిపారు. ఇద్దరు బాల కార్మికులను గుర్తించామనీ... వారిని చైల్డ్‌లైన్ అధికారులకు అప్పగిస్తామని చెప్పారు.
ఇవీ చదవండి..