కవల పిల్లలు, కవల దూడలు జన్మించడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరులో గేదెకు రెండు కవల దూడలు జన్మించాయి. రెండు దూడలూ ఆడ దూడలే కావటం విశేషం. తేతలి గ్రామానికి చెందిన కోట వెంకటేష్ వడ్లూరులో డైరీ ఫారం ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. గేదెకు కవల దూడలు పుట్టడమే అరుదు అనుకుంటే, అవి రెండూ ఆడ దూడలే కావటం చాలా సంతోషంగా ఉందని వెంకటేష్ ఆనందం వ్యక్తం చేశారు. రెండు దూడలు ఆరోగ్యంగా ఉన్నట్లు వెంకటేష్ తెలిపారు.
ఇదీ చదవండి: తణుకు పట్టణాన్ని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు!