కరోనా వ్యాధి ప్రబలకుండా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పురపాలక అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉదయం ప్రధాన రహదారులతో పాటు అన్ని వార్డుల్లోనూ బ్లీచింగ్ చల్లి సాయంత్రం రహదారులు శుద్ధి చేస్తున్నట్లు పురపాలక కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. మరో 21 రోజులపాటు వైరస్ను నాశనం చేసే ద్రావణాలతో పాటు బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీటితో శుద్ధి చేస్తామని తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఎవరికి వారే వ్యక్తిగతంగా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.
ఇదీ చూడండి: