పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో భాజపా నాయకులు మల్లిన రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆ పార్టీ నేతలను గృహనిర్బంధం చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పట్టణ ప్రధాన రహదారిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఇవీ చూడండి...