దెందులూరు మండలం దోసపాడు, పోతునూరు గ్రామాల్లోని ప్రధాన రహదారిని భాజపా, జనసేన నాయకులు పరిశీలించారు. ప్రధాన రహదారిపై ఉన్న గోతుల్లో పూలు జల్లి తమ నిరసన వ్యక్తం చేశారు. రహదారులపై గోతులను పూడ్చి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని భాజపా జిల్లా ఉపాధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ అన్నారు. రాష్ట్ర, గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులు ఆధ్వానంగా ఉండటం వల్ల నిత్యం వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో భాజపా నాయకులు విజయదాసు, ప్రభు, జనసేన నాయకులు సుగుణరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :