కరోనా వల్ల వలసకూలీలు.. ఎంతోమంది మరణిస్తున్నారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వారు ఇంటికి వెళ్లడానికి కాళ్లనే నమ్ముకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం రామచంద్రపురంలో బిహార్‌కు చెందిన వలస కూలీలు కాలినడకన తమ స్వస్థలాలకు బయలుదేరారు. వీరంతా గ్రామంలో మొక్కజొన్న విత్తన పరిశ్రమలో పని చేస్తున్నారు. రెండు నెలలుగా పరిశ్రమ మూతపడడంతో ఉపాధి కోల్పోయారు. తినడానికి తిండిలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ స్వస్థలాలకు పంపాలని పలుసార్లు అధికారులకు విన్నవించారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో దాదాపు 100 మంది వలస కూలీలు కాలినడకన బిహార్‌కు బయల్దేరారు.
ఇదీచూడండి. పశ్చిమలో పెరుగుతున్న కరోనా కేసులు