పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం జరిగింది. తీసుకున్న అప్పు తీర్చలేదంటూ ఓ యువకుడికి శిరోముండనం చేసిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. తాడేపల్లిగూడెనికి చెందిన బాధితుడు... అదే పట్టణానికి చెందిన ఎర్రసాని విజయబాబు వద్ద 3 నెలల కిందట 30 వేల నగదు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు చెల్లించాలంటూ బాధితుడిని... విజయబాబు వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో గత రాత్రి విజయబాబు మరో ముగ్గురితో కలిసి బాధితుడిని తాడేపల్లిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం బలవంతంగా కారులో తీసుకెళ్లి ఓ లేఔట్లో నిర్బంధించారు. ఓ యువకుడిని పిలిపించి శిరోముండనం చేయించి... జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద విడిచిపెట్టారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించటంతో ఎర్రసాని విజయబాబు, షేక్ నాగూర్ మీరావలి, కంకిరెడ్డి మార్కండేయులు, మోటూరి మణికంఠలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి