పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 80 వేలకు పైగా ఎకరాల్లో అరటి తోటలు పండిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో భూముల సారాన్ని బట్టి అనువైన రకాలు ఎంపిక చేసి పండిస్తుంటూరు. జిల్లాలో అధికశాతం తణుకు, ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు తదితర మండలాల్లో అరటి తోటలు ఎక్కువగా సాగవుతున్నాయి. అరటి తోటలు పండించడానికి పెట్టుబడి భారీగానే అవుతోందని రైతులు అంటున్నారు.
పెరిగిన పెట్టుబడి ఖర్చులు..
ఒక ఎకరానికి 600 వరకు మొక్కలు నాటగా.. మొదటి దశలో సుమారు 500 గెలలు దిగుబడి వస్తాయి. తోట పెంచేటప్పుడు వెదురు గడలు అవసరం ఏర్పడుతుంది. ఒక్కొక్క గడను కొనుగోలు చేయడానికి రైతులు రూ. 150 వరకు ఖర్చు చేస్తున్నారు. దీనికి తోడు మొక్కలు, ఖర్చు ఎరువుల ఖర్చు భారీగా పెరిగి పోయిందని, పెట్టుబడితో పోల్చుకుంటే మిగిలేది ఏమీ లేకపోగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.
మార్కెట్ లో ధరలకు నష్టాలే మిగులుతున్నాయి..
అరటి మొక్కలు నాటిన తర్వాత ఒక్కొక్క చెట్టు నుంచి రెండు గెలలు దిగుబడి వస్తాయి. 10 నుంచి 12 నెలల కాలంలో ఒకటి.. తర్వాత ఎనిమిది నెలల కాలంలో మరో గెల దిగుబడి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు గెలల దిగుబడికి 300 రూపాయల వరకు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. మార్కెట్లో మాత్రం రెండు గెలలకు 150 రూపాయలు మించి రావడం లేదని, దీని వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వివరిస్తున్నారు.
ఇవీ చదవండి: