ETV Bharat / state

ఫిర్యాదు చేస్తే దాడి చేశారు

author img

By

Published : Jun 4, 2020, 9:06 AM IST

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారంలో అక్రమ వసూళ్లపై ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్​కు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటన పెనుగొండ మండలం సిద్దాంతంలో జరిగింది.

Assault about complaint for house land corruption in penugonda west godavari district
సిద్దాంతం గ్రామంలో ఫిర్యాదు దారులపై వైకాపా కార్యకర్తల దాడి

అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గ్రామ శివారులోని ఘటాలదిబ్బకు చెందిన గుత్తుల రమేశ్​ భార్య గుత్తుల కల్పన పేరిట స్థలం మంజూరు అయింది. దీనికోసం స్థానిక వైకాపా నాయకులకు మార్చి నెలలో రమేశ్ రూ.50,000 చెల్లించాడు. ఇటీవల జిల్లాలో ఇళ్ల స్థలాల అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్​ను ఏర్పాటు చేశారు. కాగా... బాధితుడు గత నెల 30న టోల్ ఫ్రీ నంబర్​కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఈనెల ఒకటో తేదీన స్థానిక తహసీల్దార్ రవికుమార్.. గ్రామానికి వచ్చారు. ఇదే సమయంలో తహసీల్దార్​ను కలిసేందుకు వచ్చిన రమేశ్​పై అక్కడ ఉన్న వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

ఎల్​జీ పాలిమర్స్ కేసులో ఎన్​జీటీ కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.