కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్సుతో వ్యవసాయ మార్కెట్ కమిటీ తనిఖీ కేంద్రాలు మూతపడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 19 వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో మెుత్తం 63 తనిఖీ కేంద్రాలున్నాయి. కమిటీలకు వచ్చే ఆదాయంలో సగం ఆదాయం ఈ తనిఖీ కేంద్రాల నుంచే వస్తుంది. తనిఖీ కేంద్రాల్లో 63 మంది శాశ్వత సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా... 126 మంది పొరుగు సేవల సిబ్బంది పని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్సుతో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఆదేశాలు మేరకు తనిఖీ కేంద్రాలు మూసివేసినట్లు అధికారులు చెబుతున్నారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీలకు వచ్చే ఆదాయంతో సిబ్బంది జీతభత్యాలు, కొత్త రహదారుల అభివృద్ధి, పశు వైద్య శిబిరాలు ఇతర అభివృద్ధి పనులకు వినియోగించేవారు. తనిఖీ కేంద్రాల మూసివేతతో ఆదాయాలు తగ్గుతున్నందున ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నామని మార్కెటింగ్ శాఖ అధికారులు వివరిస్తున్నారు.
ఇదీ చదవండి: ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం