ఎన్నికలకు ముందు అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని.. పశ్చిమగోదావరి జిల్లా అగ్రిగోల్డ్ బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. డిపాజిట్ చేసి మోసపోయిన బాధితులందరికీ ఆ మొత్తాలను తిరిగి ఇచ్చేలా చేయాలన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్య పరిష్కరిస్తానని చెప్పిన జగన్.. పాలనలోకి వచ్చి ఏడాది అయినా హామీలు నెరవేర్చలేదని ఆవేదన చెందారు. బాధితుల్లో కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారని.. ఇప్పటికైనా ప్రభుత్వం అగ్రి గోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీరికి ఏఐటీయూసీ సంఘీభావం తెలిపింది.
ఇవీ చదవండి: