పశ్చిమగోదావరి జిల్లా రాజంపాలెం బీసీ వసతి గృహంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. హాజరుపట్టి, సరకు నిల్వలు వంటి వాటిలో తనిఖీలు చేయగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఎక్కువశాతం విద్యార్థులు చర్మవ్యాధులతో బాధపడుతున్నట్లు అనిశా బృందం గుర్తించింది. వసతి గృహంలో మౌలిక సదుపాయాలు సైతం సరిగా లేవని తనిఖీల్లో బట్టబయలైంది.
ఇదీ చూడండి: