పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్మిక శాఖ కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అనిశా డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కార్మికశాఖ కార్యాలయంలో ఒక వ్యక్తి నకిలీ ధ్రువ పత్రాలతో పని చేస్తున్నాడని, కార్యాలయంలో అక్రమంగా పదోన్నతులు కల్పించారని తెలిపారు. అధికారులు వసూలు చేయాల్సిన సెస్‌కు సంబంధించి రూ.79 కోట్లు వసూలు చేయకపోవడం, వివిధ కంపెనీలకు విధించిన జరిమానాలు ఆలస్యంగా వసూలు చేయడం, కొన్నిచోట్ల చేయకపోవడం తదితర విషయాలను గుర్తించామని అన్నారు. వీటన్నింటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ పూర్తైన వెంటనే వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఇదీచదవండి