ఏలూరులో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తనే భార్య అంతమెుందించింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారనే... ప్రియుడితో కలిసి చంపించింది. ఈ ఘటన తిమ్మారావుగూడెంలో జరిగింది.
ఇది జరిగింది...
తిమ్మారావుగూడెం గ్రామానికి చెందిన గోవాడ కృష్ణ, మరియమ్మలు భార్య భర్తలు. కృష్ణ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో ఒప్పంద పద్ధతిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు. సంతోషంగా సాగుతున్న వీరి కాపురం... భార్య ప్రవర్తనతో రోడ్డుకెక్కింది. అమ్మపాలెం గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి మరియమ్మకు ఫోన్ ద్వారా పరిచయమయ్యాడు.
ఆ పరిచయం కాస్తా... అక్రమసంబంధానికి దారితీసింది. ఈ విషయం... భర్త కృష్ణకి తెలిసింది. ఇరువురిని మందలించినా... వారి ప్రవర్తనలో మార్పులేదు. వీరి వివాహేతర సంబంధానికి భర్తగా అడ్డుగా ఉన్నాడని కృష్ణని హతమార్చాలనుకున్నారు... భార్య మరియమ్మ, ప్రియుడు రాజేష్. వీరి పథకానికి రాజేష్ స్నేహితుడి గణేష్కుమార్ తోడయ్యాడు.
గత నెల 29న సాయంత్రం దుగ్గిరాల జాతీయ రహదారి వద్దకు రమ్మని కృష్ణను పిలిచారు. చేరుకున్న కృష్ణపై రాళ్లతో దాడి చేసి పారిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించేలోపే... మార్గమధ్యలో కృష్ణ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేయగా మృతుడు గోవాడ కృష్ణగా గుర్తించారు. వివాహేతర సంబంధం కారణంగా భర్తను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి