పందులు పెంచవద్దని చెప్పినందుకు... ఓ శానిటరీ ఇన్స్పెక్టర్పై పందుల పెంపకందారుడు కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని తంగెళ్లమూడి గౌరీదేవి గుడి సమీపంలో జరిగింది. రంగయ్య అనే వ్యక్తి తంగెళ్లమూడి ప్రాతంలో పందులను పెంచుకుంటూ... జీవనం సాగిస్తుంటాడు. అయితే అక్కడ పందులు పెంచకూడదంటూ జేవీ శ్రీరామమూర్తి అనే శానిటరీ ఇన్స్పెక్టర్ రంగయ్యకు చెప్పాడు. కోపోద్రిక్తుడైన రంగయ్య... అతడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో శ్రీరామమూర్తి చేతికి తీవ్రగాయమైంది. రంగయ్యను పట్టుకుని శానిటరీ సిబ్బంది, స్థానికులు దేహశుద్ధి చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పందులు పెంచొద్దు అన్నందుకు... ప్రాణాలు తీయబోయాడు - attacked with knife in eluru news
పందుల విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వివాదం... కత్తితో దాడి చేసే వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు.
![పందులు పెంచొద్దు అన్నందుకు... ప్రాణాలు తీయబోయాడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5124342-865-5124342-1574251843317.jpg?imwidth=3840)