ETV Bharat / state

ఊరించి... ఉసూరుమనిపించి..!

author img

By

Published : May 5, 2020, 6:41 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో గ్రీన్ జోన్ గా ప్రకటించిన ఉండ్రాజవరం మండలంలోని ఎనిమిది మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఒక్కరోజు ఊరించి... మరుసటి రోజే మద్యం ప్రియులను ఉసూరుమనిపించారు.

8  liquor shops were closed in west godavari district
మూసేసిన మద్యం దుకాణాలు

కరోనా వైరస్ ప్రభావంతో గ్రీన్ జోన్ లుగా ప్రకటించిన ప్రాంతాలలో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ అనుమతితో సోమవారం దుకాణాలు తెరిచి అమ్మకాలు ప్రారంభించారు. మందుబాబులు దుకాణాలకు పోటెత్తడంతో నిర్ణీత సమయానికంటే ముందే దుకాణాలు మూసివేశారు.

మద్యం దుకాణాల వద్దకు నిషేధిత ప్రాంతాలనుంచి మద్యం ప్రియులు తరలి వస్తున్నారనే అనుమానంతో, ప్రభుత్వం తాజాగా పెంచిన ధరలు స్థిరీకరించిన తర్వాత అమ్మకాలు సాగించవచ్చు అనే ఉద్దేశ్యంతోనో మద్యం అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు భావిస్తున్నారు. దుకాణాలు మూత పడటంతో పోలీసులు పహారా కాస్తున్నారు.

ఇదీ చదవండి

మద్యానికి మందు బాబుల పూజలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.