సామాన్యంగానే అల్లుళ్లంటే మర్యాదలెక్కువ. అందులోనూ గోదావరి జిల్లాల్లో మరీ ఎక్కువ. ఇక సంక్రాంతి సమయాల్లో కొత్త అల్లుళ్లొస్తే ఆ హంగామా అంతా ఇంతా ఉండదు. పిండి వంటలు, కొత్త బట్టలు అవీ ఇవీ అని ఆ హడావుడే చెప్పక్కర్లేదు. అయితే.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఓ కుటుంబం తమ ఇంటికి కాబోయే అల్లుడికి ఏకంగా 365 రకాల వంటకాలతో ఆతిథ్యమిచ్చింది.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అత్యం మాధవి, వెంకటేశ్వరరావు కుమార్తె కుందవి. ఈ అమ్మాయికి.. తణుకుకు చెందిన తుమ్మలపల్లి సాయి కృష్ణతో వివాహం నిశ్చయమైంది. జిల్లాలోని నరసాపురానికి చెందిన కుందవి అమ్మమ్మ, తాతయ్య గోవింద్, నాగమణి.. కాబోయే వధూవరులను తమ ఇంటికి ఆహ్వానించారు. కాబోయే మనవడికి 365రకాల వంటలను రుచి చూపించారు.
100 రకాల స్వీట్లు, పులిహోర, దద్దోజనం, 30 రకాల కూరలతో పాటు రకరకాల పిండి వంటలతో ఆతిథ్యమిచ్చారు.
ఇదీ చదవండి:
నింగిని తాకిన సంక్రాంతి సంబరాలు..! సంతోషాల ఊయల్లో తెలుగు లోగిళ్లు!!