పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చిలకపాడు, పసలపూడి గ్రామాల పరిధిలో రహదారుల పక్కనున్న గడ్డిమేట్లకు, ధాన్యం బస్తాలకు దుండగులు నిప్పుపెట్టారు. సుమారు 20 గడ్డిమేట్లకు, రెండుచోట్ల ధాన్యం బస్తాలకు నిప్పంటించారు. సమీపంలో కాపలా ఉన్న రైతులు... స్థానికులకు సమాచారం అందించారు. అప్పటికే గడ్డి పూర్తిగా దగ్ధం కాగా... సుమారు 50 బస్తాల ధాన్యం అగ్నికి ఆహూతైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం గడ్డి దొరకని పరిస్థితుల్లో గడ్డివాములు తగలబడటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీచూడండి.సినీఫక్కీలో రైల్వే ఉద్యోగి హత్య.. ఛేదించిన పోలీసులు