కర్ఫ్యూ నిబంధనలు సడలించినా, నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పోలీసులు చర్యలు చేపట్టారు. ఆంక్షల అమల్లో ఉన్న కారణంగా ప్రధాన రహదారులపైకి ప్రజలు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
తణుకు ప్రభుత్వ ఆసుపత్రి, నరేంద్ర థియేటర్, న్యాయస్థానాల గేట్ల వద్ద రహదారులపై బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు ప్రత్నామ్యాయ రహదారులనే ఉపయోగించాలని సూచించారు.
ప్రధాన రహదారిపై ప్రజలు రాకుండా ఉండేందుకు పోలీసులు అడ్డుకున్న తీరుపై పలువురు వాగ్వాదానికి దిగారు. నిత్యవసరాలు, మందుల కొనుగోలుకు వచ్చిన వారిని అడ్డుకోవటం దారుణమని ఆగ్రహించారు. పోలీసులు సమన్వయం చేస్తూ వారికి సర్ది చెప్పారు.
తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు రహదారిపై పర్యటించి, పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రజలెవ్వరూ ఇళ్లను వదిలి ప్రధాన రహదారులపై రావొద్దని కోరారు. నిత్యావసర వస్తువుల దుకాణాలు, మందుల షాపులు మినహా మిగిలిన దుకాణాలను మూసివేశారు.
ఇదీ చదవండి: