శ్రీకాకుళం జిల్లా రంగస్థలంలోని అరబిందో రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలి విజయనగరం జిల్లా పార్వతీపురం వివేకానంద కాలనీకి చెందిన రెడ్డి రాహుల్ మృతి చెందినట్లు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. విషయం తెలియటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రాహుల్‌కు భార్య, మూడేళ్ల కొడుకు ఉన్నాడు. రాహుల్ ప్రతిరోజూ విజయనగరం నుంచి విధులకు వెళ్తుంటాడు. ఒక్కగానొక్క కొడుకు డ్యూటీకి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లటంతో తల్లిదండ్రుల తల్లడిల్లుతున్నారు. రాహుల్ మరణవార్త కాలనీలో విషాదం నింపింది.
ఇది చూడండి: 370 రద్దు: అమిత్‌షాపై రజనీ ప్రసంశల జల్లు