మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని కోరుతూ.. విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేశారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రమణమ్మ మాట్లాడుతూ... కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోందన్నారు. ఇలాంటి సమయంలో మద్యం దుకాణాలు తెరవడం, రేట్లు పెంచడం సరికాదన్నారు.
బ్రాందీ షాపుల వద్ద భౌతిక దూరం పాటించడం లేదని, మాస్కులు ధరించడం లేదని అన్నారు. వెంటనే మద్యం షాపులు మూసివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళలంతా ధర్నాలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: