ఇదీ చదవండి:
బొబ్బిలిలో మహిళా సంక్షేమ కార్యదర్శులకు అవగాహన సదస్సు - విజయనగరం జిల్లా తాజా సమాచారం
విజయనగరం జిల్లా బొబ్బిలిలో మహిళా సంక్షేమ కార్యదర్శులకు అవగాహన సదస్సు జరిగింది. ఏఎస్పీ గౌతమి సాలి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మహిళా సంక్షేమ కార్యదర్శుల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. ఉద్యోగులకు కేటాయించిన ప్రాంతాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లో జరిగే బాల్య వివాహాలను అడ్డుకోవడం, అక్రమ మద్యం అమ్మకాలపై నిఘా ఉంచాలన్నారు.
బొబ్బిలిలో మహిళా సంక్షేమ కార్యదర్శులకు అవగాహన సదస్సు