ETV Bharat / state

గిరిజనుల ఆవేదన...ఇంకెన్నాళ్లు మాకు ఈ 'డోలీ' తిప్పలు.. - vizianagaram tribals faced problems

తమ సమస్యలను పరిష్కరించండి మహా ప్రభో అంటూ విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓట్ల కోసం వచ్చేటప్పుడు ఉన్న ఆరాటం... తమ సమస్యల పరిష్కారంలో లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన సౌకర్యాలు లేక... అత్యవసర పరిస్థితుల్లో డోలీనే దిక్కవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లీ కష్టాలు అని ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు.

ఇంకా ఎన్నాళ్లు మాకు ఈ తప్పని 'డోలీ' తిప్పలు
author img

By

Published : Oct 12, 2019, 11:51 PM IST

ఇంకా ఎన్నాళ్లు మాకు ఈ తప్పని 'డోలీ' తిప్పలు

పాలకులు మారినా... ప్రభుత్వాలు మారినా తమ సమస్యలు తీర్చేవారే కరవయ్యారని విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న మహిళకు పురిటి నొప్పి రావటంతో డోలీలో దిగువ గుణద వరకు తీసుకొచ్చిన గ్రామస్థులు... నిన్న గిరిజన వ్యక్తిని వైద్యం కోసం పాలెం పంచాయతీ కుస్తూరు గ్రామం నుంచి పూజారిగూడ గ్రామం వరకు వైద్యం కోసం డోలీలో తీసుకువచ్చారు. గిరిజనులమని పేర్లు చెప్పుకుని గెలుస్తున్న నేతలు... తర్వాత తమను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వెంటనే స్పందించి గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి... డోలీ కష్టాలు తప్పించాలని ప్రజలు వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి-అవ్వా...నీరు కావాలంటూ వచ్చాడు..దోచుకెళ్లాడు!

Intro:Body:

dfdf

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.