ETV Bharat / state

అచ్చెన్నాయుడి అరెస్టుని నిరసిస్తూ సాలూరులో ఆందోళన - tdp leaders protest in vizianagaram news

విజయనగరం జిల్లా సాలూరులో తెదేపా నేతలు నిరసనకు దిగారు. మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి అరెస్టు అక్రమమని, వైకాపా అక్రమాలను ప్రజల గమనిస్తున్నారని అన్నారు. తెదేపా నేతలను వేధిస్తూ అక్రమ కేసులు బనాయిస్తే భయపడి ఊరుకుంటామని అనుకోవద్దని పేర్కొన్నారు.

vizianagaram tdp leaders protest
మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు మద్దతుగా తెదేపా నేతలు నిరసన
author img

By

Published : Jun 12, 2020, 4:07 PM IST

కార్మిక శాఖ మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా సాలూరులో తెదేపా నేతలు నిరసనకు దిగారు. ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, తెదేపా నియోజకవర్గ ఇన్​ఛార్జి ఆర్​పీ ధనుంజయ్​దేవ్​ ఆధ్వర్యంలో 26వ నెంబర్ జాతీయ రహదారిపై తెదేపా శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు అరెస్ట్​పై నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం పరిపాలన చేతకాక తెదేపా నేతలపై వేధింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అచ్చెన్నాయుడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి... 'ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.