పట్టణంలో ప్రధాన కూడళ్లలో కరోనా వైరస్ భారీ చిత్రం వేసి ఇంట్లోనే ఉండండి సురక్షితంగా ఉండండి అంటూ పోలీస్ శాఖ వినూత్నంగా ప్రచారం చేసింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో దేవిగుడి కూడలిలో ఈ మేరకు రహదారిపైనే కరోనా చిత్రాన్ని వేయించారు. పట్టణానికి చెందిన చిత్రకారుడు రఫీ 7 గంటల శ్రమించి ఈ చిత్రం వేశారు. రూ. 7వేలు వెచ్చించి పోలీసు శాఖ సహకారంతో ఈ చిత్రం వేశానని, ప్రజలు బయట తిరుగుతున్నారని, వారిలో అవగాహన కల్పించేందుకు ఈ చిత్రం తోడ్పడితే చాలన్నారు. ప్రపంచ కళ దినోత్సవం రోజు ఈ చిత్రం వేయటం విశేషం.
ఇదీ చూడండి: