విజయనగరం కార్పొరేషన్ తొలి మేయర్గా 11వ డివిజన్ వైకాపా అభ్యర్థిని వెంపడాపు విజయలక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల ప్రక్రియను నిర్వహంచారు. ఎన్నికల పరిశీలీకులు కలెక్టర్ హరి జవహర్ లాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. వెంపడాపు విజయలక్ష్మి మేయర్గా ఏకగ్రీవంగా ఎంపికైనట్టు ప్రకటించారు. డిప్యూటీ మేయర్లుగా ముచ్చు నాగలక్ష్మీ, కోలగట్ల శ్రావణికి అవకాశం దక్కింది.
ఎంపికైన అభ్యర్ధులకు కలెక్టర్ హరి జవహర్ లాల్, కార్పొరేషన్ కమిషనర్ వర్మ, తదితరులు పుష్పగుచ్చాలిచ్చి అభినందించారు. అందరి సహాయ సహకారాలతో విజయనగరం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మేయర్ విజయలక్ష్మి తెలియజేశారు.
ఇవీ చూడండి: