సంప్రదాయాల ప్రకారమే విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలను ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ తెలిపారు. సంప్రదాయాలకు భంగం కలగకుండానే కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరిపేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలియచేశారు. ఉత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులు, పోలీసులతో ఆలయం వద్ద కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ జవహర్లాల్ తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈనెల 27న అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. అధికారులంతా సమన్వయంతో సమిష్టిగా పనిచేస్తూ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషిచేయాలని కోరారు.
ఇదీ చదవండి