ETV Bharat / state

జిల్లాలో కరోనా కేసుల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేయాలి: కలెక్టర్ - విజయనగరం కలెక్టర్ హరిజవహర్ లాల్

విజయనగరం జిల్లాలో కొవిడ్‌ కేసుల‌ను తగ్గించేందుకు కృషి చేయాలని కలెక్టర్ హరి జవహర్ లాల్ పిలుపునిచ్చారు. కొవిడ్​పై వైద్యారోగ్య‌శాఖ అధికారులు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్ల‌తో క‌లెక్ట‌ర్ జూమ్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. కరోనా కట్టడికి అందరు పాటుపడాలని తెలిపారు.

collector conference with officials
collector conference with officials
author img

By

Published : May 14, 2021, 10:03 AM IST

విజయనగరం జిల్లాలో కొవిడ్‌ కేసుల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌డం ద్వారా నెల రోజుల్లో జిల్లాలో సాధార‌ణ ప‌రిస్థితుల‌ను తీసుకువచ్చేందుకు కృషి చేయాల‌ని.. క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ కోరారు. దీని కోసం గ్రామ‌స్థాయి నుంచి, జిల్లా స్థాయి వ‌ర‌కు, యంత్రాంగ‌మంతా స‌మిష్టిగా కృషి చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. వైద్యారోగ్య‌శాఖ అధికారులు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్ల‌తో, క‌లెక్ట‌ర్ జూమ్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

జిల్లాలో జ‌రుగుతున్న ఫీవ‌ర్ స‌ర్వే, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌పై చర్చించారు. నెల రోజుల పాటు ప‌టిష్ట‌మైన కార్యాచ‌ర‌ణ ద్వారా, వ‌చ్చే నెల ఇదే స‌మ‌యానికి కొవిడ్ కేసుల సంఖ్య‌ను రెండంకెల‌కు ప‌రిమితం చేయాల‌న్నారు. దీనికోసం రెండెంచ‌ల వ్యూహాన్ని అమ‌లు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఓ వైపు క‌రోనాను క‌ట్ట‌డి చేయడానికి చ‌ర్య‌లు తీసుకోవ‌డం తోపాటు, వ్యాధి సోకిన‌ వారికి స‌మ‌ర్థ‌వంత‌మైన చికిత్స‌ను అందించి, పూర్తిగా న‌యం చేయ‌డం ల‌క్ష్యాలు కావాల‌ని అన్నారు. ఇది జ‌ర‌గాలంటే, వ్యాధిప‌ట్ల ప్ర‌తీఒక్క‌రిలో అవ‌గాహ‌న పెంచాల‌ని సూచించారు. కొవిడ్ వ్యాధి నియంత్ర‌ణ‌కు కేవ‌లం అవ‌గాహ‌న ఒక్క‌టే మార్గ‌మ‌ని కలెక్టర్ స్ప‌ష్టం చేశారు. ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్ విధానం మ‌హారాష్ట్ర‌లో వ్యాధి నియంత్ర‌ణ‌కు మంచి ఫలితాన్ని ఇచ్చింద‌ని, అదే విధానాన్ని ఇక్క‌డ కూడా అమ‌లు చేయాల‌ని సూచించారు.

అంబులెన్సులు, టెస్టులు, వ్యాక్సిన్లు, ద‌హ‌న కార్య‌క్ర‌మాలు, ర‌వాణా ఛార్జీలకూ కూడా అధికంగా వ‌సూలు చేసే అవ‌కాశం ఉంద‌న్నారు. వీట‌న్నిటిపైనా క్షేత్ర‌స్థాయిలో అధికారులు దృష్టిపెట్టి, వాటిని అరిక‌ట్టాల‌ని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు భ‌రోసాను క‌ల్పించి ప్ర‌భుత్వ యంత్రాంగంపై న‌మ్మ‌కాన్ని పెంచాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.

ఇదీ చదవండి:

కొవిడ్​పై అవగాహన.. ప్రచార సారథిగా గ్రామ సర్పంచ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.